ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా మారుతి సినిమా షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్(prabhas). తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు మారుతి సినిమాకు ఈ రేంజ్ బడ్జెట్ ఏంటనేదే? ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్(prabhas). సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో సలార్ రూ.250 నుంచి రూ.300 కోట్లు. కల్కి దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతోంది. అయితే..ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో.. అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి. కానీ అన్నీ భారీ ప్రాజెక్స్ట్ కాబట్టి.. మధ్యలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాడని వినిపించింది.
అలాగే.. కేవలం తెలుగు ఆడియెన్స్ కోసం ప్రభాస్(maruthi) ఈ సినిమా చేస్తున్నాడని అన్నారు. ప్రభాస్ పారితోషికమే ఈ సినిమాకు హెయెస్ట్ బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెడుతున్నారనే షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే దాదాపు రూ.150 కోట్లు వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా.. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. మారుతి ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ రేంజ్‌లోనే పాన్ ఇండియా లెవల్లో వస్తుందనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి..ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు. కానీ మారుతి మాత్రం ప్రభాస్ క్యారెక్టర్‌ను అదిరిపోయేలా రాసుకున్నట్టు టాక్ ఉంది.