»The Cm Who Was Flogged For The People The Video Is Viral
CM Baghel : ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న సీఎం.. వీడియో వైరల్
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది. కొరడాతో కొట్టుకుని భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టుకున్నారో ఆయన స్పష్టం చేశారు.
దీపావళి పండుగ సందర్బంగా ఛత్తీస్గడ్ (Chhattisgarh) రాష్ట్రంలో గౌరా గౌరీ పూజ ఘనంగా నిర్వహించారు. దుర్గ్ జిల్లాలోని జంజ్గీర్ గ్రామంలో జరిగిన గౌరా గౌరీ పూజకు హాజరైన సీఎం బఘేల్ (CM Baghel) ఎంతో భక్తిప్రపత్తులతో అమ్మవారిని పూజించారు. సంప్రదాయాన్ని అనుసరించి చేతిపై కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కొరడా దెబ్బలు తిన్నానని వెల్లడించారు. ఈ పండుగ అందరూ సమానమేనని చాటుతుందని, అమ్మవారి ముందు అందరూ ఒక్కటేనని అన్నారు.
ఇది సర్వ మానవ సమానత్వాన్ని సూచించే పండుగ అని సీఎం బఘేల్ వివరించారు.చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే తొలి దశ పోలింగ్ ఈ నెల 7 వ తేదీన పూర్తయింది. ఇక చివరిదైన రెండో విడత పోలింగ్ ఈ నెల 17 వ తేదీన నిర్వహించనున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో విజయంపై అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress party).. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది. కొరడాతో కొట్టుకుని భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ కొరడా దెబ్బలు (Flogging) ఎందుకు కొట్టుకున్నారో ఆయన స్పష్టం చేశారు.