»Vijayashanthis Re Entry In Congress Malluravis Sensational Comments
Mallu Ravi : విజయశాంతి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ..మల్లురవి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
తెలంగాణ బీజేపీ(BJP)లో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరునట్లు తెలుస్తొంది. నేడో,రేపో ఆమె కాంగ్రెస్‌లో చేరుతారని ఆ పార్టీ సీనియర్ నేత టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) ధ్రువీకరించారు. కొద్దికాలంగా విజయశాంతి బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) సభలకూ హాజరుకావడంలేదు.ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో చర్చలు పూర్తి చేసిన విజయశాంతి(Vijayashanti)అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కాగా గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విజయశాంతికి కమలం పెద్దలు షాకిచ్చారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో ఆమె పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్(Congress)లోనే చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.