NRPT: నర్వ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 11 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 1,22,900 నగదు, 9 బైకులు, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.