»Telangana High Court Notice To Ap Cm Jagan Mohan Reddy
CM Jagan mohan reddy:కి తెలంగాణ హైకోర్టు నోటీసులు..కారణమిదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య జగన్ అక్రమాస్తుల కేసు విషయంపై పిల్ వేసిన నేపథ్యంలో ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.
Files missing in former minister Talasanis OSD Kalyan office masab tank
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap CM Jagan mohan reddy)కి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నోటీసులు(notice) జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో మాజీ ఎంపీ హారిరామ జోగయ్య వేసిన పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది. పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసింది. ఆ క్రమంలో జోగయ్య తరఫున లాయర్ పోలిశెట్టి రాధకృష్ణ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది. అయితే సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించాలని జోగయ్య పిటిషన్లో కోరారు. అంతేకాదు వచ్చే 2024 అసెంబ్లీ అన్నికల లోపు ఆ కేసుల అంశం తేల్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని జోగయ్య కోరారు. ఈ క్రమంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL)గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించి ఆదేశాలు జారీ చేసింది.