Pollution : ఢిల్లీలో కాలుష్యం..ఆనంద్ మహీంద్రా సూచన
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు.
ఢిల్లీ(Delhi)లో విపరీతమైన వాయువు కాలుష్యం కలవరపెడుతొంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతుల పంట వ్యర్థాలను తగులబెట్టడమే ఇందుకు ప్రధాన కారణరమని చెబుతున్నారు. ఈ తరుణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తు ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా(Social media)లో చురుగ్గా ఉంటూ.. తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకునే ఆనంద్ మహీంద్రా వాయు కాలుష్య నివారణకు చక్కటి సలహా ఇచ్చారు. ‘‘పునరుత్పత్తి వ్యవసాయాన్ని (Regenerative Agriculture) ప్రోత్సహించడం ద్వారా దిల్లీలో కాలుష్యం(Pollution)తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాక నేల ఉత్పాదకతను కూడా పెంచుతుంది.
పంట వ్యర్థాలను కాల్చడానికి బదులుగా ఈ ప్రత్యామ్నాయాన్ని పాటించడం లాభదాయకం’’ అంటూ.. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. రాజధాని నగరంలో వాయు నాణ్యత పడిపోతుండటంతో కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి మరుసటి రోజు నుంచి ‘సరి- బేసి’ (even-odd)విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్(Work from home)విధానంలో పనిచేయాలని పేర్కొంది. ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలకు సూచించింది. అంతేకాదు, ఈ నెల 14 నుంచి 17 వరకు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
To heal Delhi’s pollution, Regenerative Agriculture MUST be given a chance. It provides a remunerative alternative to stubble burning while simultaneously increasing soil productivity. @VikashAbraham of @naandi_india stands ready to help. Let’s do it! pic.twitter.com/XvMPAghgdQ