»Cm Jagans Key Decision Free Treatment Even If There Is No More Arogyashri
CM Jagan: సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై ఆరోగ్యశ్రీ లేకపోయినా ఉచితంగా చికిత్స
ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించుకున్న వారికి ఉచితంగా ఏడాదిపాటు మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ కింద నమోదు కాని రోగులు ఉంటే వారిని ప్రత్యేక కేసుల కింద పరిగణించి ఉచితంగా చికిత్స అందించాలని, వాటి బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ (Arogya Sri) లేనివారికి కూడా వైద్యం విషయంలో ఉచితంగా చికిత్స అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. నేడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైందని, వైద్య శిబిరాల నిర్వహణ ఆఖరి దశకు వచ్చిందన్నారు. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98 శాతం, వార్డు సచివాలయాల్లో 77 శాతం శిబిరాల నిర్వహణ పూర్తయినట్లు వెల్లడించారు.
శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తి స్థాయిలో చేయూతనివ్వాలన్నారు. ఆరోగ్య సమస్యలు (Health Problems) ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంత వరకూ చేదోడుగా ఉండాలన్నారు. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తి చేసినట్లుగా వివరించారు. అలాగే 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు చేపట్టామన్నారు. జనవరి 1వ తేది నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు (Jagananna Arogya Suraksha Camps) నిర్వహించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.
ప్రతి నెలా మండలాల్లో నాలుగు క్యాంపులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని రోగాలు ఏమైనా ఉంటే వాటిని ప్రత్యేక కేసుల కింద పరిగణించి ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని సీఎం జగన్ (Cm Jagan) కలెక్టర్లను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించుకున్న తర్వాత పేషెంట్లపై దృష్టి పెట్టి వారికి ఏడాది వరకూ ఉచితంగానే అన్ని మందులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.