BJP Mla Raja Singh Warning To His Own Party Leaders
Bandi Sanjay: బండి సంజయ్ (Bandi Sanjay) వ్యక్తి కాదు శక్తి అన్నారు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. కరీంనగర్లో బండి సంజయ్ నానిమేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబ్బులు ముఖ్యమా ధర్మం ముఖ్యమా అడిగారు. చేతగాని ఎమ్మెల్యే, చేతగాని మంత్రి ఇక్కడ ఉన్నాడని గంగుల కమలాకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాత్రి అయితే చాలు మందు తాగడమే అతని పని అని సెటైర్లు వేశారు.
భూమి కబ్జా చేసేది ఎవరు..? ఇసుక దోపిడీ జరిగిందని గుర్తుచేశారు. చివరకు వక్ఫ్ బోర్డు, ఆలయాల భూములు కూడా కబ్జా చేశారని ఆరోపించారు. బండి సంజయ్ మహా శక్తి అని.. ఆ శక్తితో పోటీ చేయాలంటే.. మీ లాంటి దున్నపోతులతో కాదని విరుచుకుపడడారు.
కరీంనగర్ యువకులు జోష్‌లో ఉండాలని రాజా సింగ్ మరీ మరీ కోరారు. డబ్బుల బలం చూపించి లోబరచుకుంటారని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు. మైనార్టీ ఓట్లు అమ్మేందుకు అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒవైసీకి దమ్ముంటే కరీంనగర్లో మజ్లిస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని సవాల్ విసిరారు.
అంతకుముందు బండి సంజయ్ కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నివాసానికి వచ్చి తన తల్లికి పాదాభివందనం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బండి సంజయ్‌ను కార్యాలయంలో కలిశారు. ఇరువురు నేతలు, పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య ఎన్టీఆర్ చౌరస్తాకు వెళ్లారు. ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.