Minister KTR : గంగవ్వతో నాటుకోడి కూర వండిన కేటీఆర్..మైవిలేజ్‌షో’ టీమ్‌తో సందడి
రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో కేటీఆర్ సందడి చేశారు.
తెలంగాణ(Telangana)లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఇంటికి వెళ్లి తమకే ఓట్లు వేయాలంటూ కోరుతున్నారు. కొందరు ఓటర్లకు చేరువ అయ్యేందుకు వివిధ రకలగా యత్నిస్తున్నారు. సోషల్ మీడియా (Social media) వేదికగా ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ (Minister KTR), ప్రముఖ యూట్యూబర్లు ‘మై విలేజ్ షో’ బృందంతో కలిసి వంట చేశారు. తెలంగాణలో విశేష ఆదరణ ఉన్న ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ టీమ్‌తో కలిసి హైదరాబాద్ శివారులో వంట పనుల్లో స్వయంగా పాల్గొని భోజనం చేశారు.
కేటీఆర్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లెకు చెందిన ‘మైవిలేజ్‌షో’ (MyVillageShow) టీమ్‌కు చెందిన గంగవ్వ, అనిల్, అంజి, చందు పాల్గొన్నారు. వారితో పలు అంశాలపై మాట్లాడారు. కేటీఆర్ టమాటాలు కట్ చేయడంతోపాటు వంట పనుల్లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మై విలేజ్ షో టీం అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తన ఫ్యామిలీ వివరాలు పంచుకున్నారు. బాల్యం పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తనకు ఈత రాదని చెప్పుకొచ్చారు. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) తనకుంటే మూడేళ్లు చిన్నదని అన్నారు. రాఖీ పండుగ రోజు కవితకు చీర పెట్టినట్లు చెప్పారు.
తనకు ఇద్దరు బావమరుదులు ఉన్నారని, తనను బాగా చూసుకుంటారని తెలిపారు. గంగవ్వ (Gangavva) కుటుంబానికి ఎంత భూమి ఉందని అడిగారు. రైతు బంధు (Raitu bandhu) పడుతుందా లేదని ఆరా తీశారు. తనకు రైతు బంధు వస్తుందని గంగవ్వ చెప్పారు. సిరిసిల్ల(Sirisilla)లో తాను పోటీ చేస్తున్నప్పటి నుంచి ఒక్క చుక్క మందు పోయలేదని, ఒక్క నోటు పంచలేదన్నారు. కానీ ప్రజలు తనను గెలిపించారని అన్నారు. మంచి చేస్తామని నమ్మకం ప్రజలకు కల్పించగలిగితే ప్రజలు అక్కున చేర్చుకుంటారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ (CMKCR) ప్రభుత్వం మరో సారి వస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని అన్నారు. కొందరు నెటిజన్స్ (Netizens) పలు రకల కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల జిమ్మిక్కులు అని ఓట్లు కోసం పాట్లు అని కామెంట్స్ చేస్తున్నారు