»Pakvsbang Competing In World Cup 2023 Kolkata Eden Garden What Is Pakistans Target
PakVsBang: బ్యాటింగ్ ముగిసిన బంగ్లా..పాక్ టార్గెట్ ఇంతేనా?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ రోజు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా మొదట్లో మూడు కీలక వికెట్లు పడడంతో నెమ్మదించింది. ఇక మొత్తానికి 204 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.
PakVsBang competing in World Cup 2023 Kolkata Eden Garden.. What is Pakistan's target?
PakVsBang: వన్డే వరల్డ్ కప్ 2023 జోరుగా సాగుతోంది. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇరు జట్లు పోటీపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టుకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. కీలకమైన మూడు వికెట్లు పడడంతో మిగతా ఆటగాళ్లు నెమ్మదిగా ఆడారు. దీంతో 45.1 ఓవర్లలో కేవలం 204 పరుగుల చేసి ఆల్ ఔట్ అయ్యారు. ఆ నేపథ్యంలో బౌలింగ్‌లో పాక్ బౌలర్లు బంగ్లా ఆటగాళ్లను తీవ్రంగా కట్టడి చేశారు. మొత్తానికి పాకిస్థాన్ టార్గెట్ 205 ఫిక్స్ అయింది.
షహీన్ షా అఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఐదో బంతికి బంగ్లా ఓపెనర్ తాంజిద్ హసన్ డక్ ఔట్ అయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన నజ్ముల్ హోసెన్ శాంతో నాలుగు పరుగులు చేసి అఫ్రిది చేతికే దొరికిపోయాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ముష్పీకర్ రహీమ్ కేవలం ఐదు పరుగులు చేసి హరీస్ రౌఫ్ వేసిన బంతికి ఔట్ అయి పెవిలియన్‌కు చేరాడు. దీంతో బంగ్లాదేశ్ ఆరు ఓవర్లకే 23 పరుగులు చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు ఆత్మరక్షణలో పడింది. వీకెట్లను కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడింది. తరువాత పుంజుకున్న లిటన్ దాస్ 64 బంతుల్లో 45 పరుగులు చేసి 4వ వికెట్‌ను పాక్‌కు సమర్పించుకున్నాడు. బంగ్లా టీమ్‌లో మహ్మదుల్లా అర్థ శతకం బాదాడు. 70 బంతుల్లో 56 పరుగులు చేసి ఆఫ్రిది వేసిన బంతికి వికెట్ ఇచ్చేశాడు. ఆ తరువాత కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43), మెహిదీ హసన్ మిరాజ్(25) పరుగులు చేశారు. ఇక బౌలింగ్‌లో రెచ్చిపోయిన పాక్ ఫేసర్స్ షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం చెరో 3 వికెట్లు తీశారు. హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీసుకోగా, ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చేరో వికెట్ తీశారు. 205 పరుగుల టార్గెట్‌తో పాకిస్థాన్ బరిలో దిగింది.