ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలి సర్జరీ కారణంగా గత కొన్ని రోజులుగా యూరప్‌లోనే ఉన్నాడు డార్లింగ్. అయితే తాజాగా ప్రభాస్ ఇండియాలో ల్యాండ్ అయ్యే సమయం వచ్చేసినట్టుగా తెలుస్తోంది.
డిసెంబర్ 22న రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘సలార్’ పై భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. థియేటర్లోకి రావడమే లేట్.. బాక్సాఫీస్ బద్దలవుతుందని నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు ప్రభాస్. మోకాలి సర్జరీ కారణంగా యూరప్‌లో రెస్ట్ మోడ్‌లో ఉన్నాడు. అక్టోబర్ 23న బర్త్ డే వేడుకలు కూడా అక్కడే జరుపుకున్నాడు ప్రభాస్.
అయితే ఇప్పుడు.. ప్రభాస్ ఇండియాకు కూడా వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. నవంబర్ 6న డార్లింగ్ ఇండియాలో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇండియాకి రాగానే.. ‘సలార్’ ప్రమోషన్స్ డేట్ పై మేకర్స్‌కు క్లారిటీ ఇవ్వనున్నాడట. అయితే.. దానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ఈలోపు మారుతి చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ కంప్లీట్ చేయనున్నట్టుగా సమాచారం.
ఆ తర్వాత ‘సలార్’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. బహుశా నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ ఎంట్రీ నుంచి సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆ సమయంలోనే రిలీజ్ చేసే అవకాశముంది. త్వరలోనే హోంబలే వారు సలార్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒక్కసారి ట్రైలర్ బయటికొస్తే.. సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోనున్నాయి. దానికోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.