Chiru Post: ఖైదీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి (chiranjeevi) మంచి గుర్తింపు వచ్చింది. మాస్ హీరోగా పేరు తెచ్చి, ఇండస్ట్రీలో స్టార్‌ను చేసింది. ఆ సినిమా విడుదలై ఈ రోజుకు 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భాన్ని పురష్కరించుకొని మెగాస్టార్ పోస్ట్ చేశారు. ఖైదీ మూవీలోని రెండు ఫోటోలను పంచుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన జ్ఞాపకాలను నెరవేరుసుకున్నారు.
నిజంగా అభిమానుల గుండెల్లో తనను శాశ్వత ఖైదీని చేసింది. ఆ సినిమా తన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ అని గుర్తుచేశారు. ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరవలేనని తెలిపారు. హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా ఖైదీ సినిమాను డైరెక్టర్ కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొంది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. హిందీ, కన్నడలో రీమేక్ చేశారు. ఖైదీ తర్వాత చిరంజీవి ఇమేజ్ పెరిగింది. తర్వాత సుప్రీం హీరో.. ఆ వెంటనే మెగాస్టార్ ట్యాగ్ లైన్ పొందారు.
ఖైదీ మూవీ విడుదలై 40 ఏళ్లు అవుతోన్న సందర్భంగా డైరెక్టర్ ఎ కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్తా మూవీస్ బృందం, రచయితలు పరుచూరి సోదరులు, కో స్టార్స్ సుమలత, మాధవీ.. ఇతర బృందానికి చిరంజీవి అభినందనలు తెలిపారు. గొప్ప విజయం అందజేసిన తెలుగు ప్రేక్షకులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.