ప్రియుడిని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్(Bangladesh)కు చెందిన మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి చివరకు కటకటాలపాలైంది. ఉత్తర త్రిపుర (Tripura) జిల్లా ధర్మనగర్లో ఈ ఘటన జరిగింది. ఫుల్బరీలో నివసించే 34 ఏళ్ల నూర్ జలాల్ (Noor Jalal) ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడు. వివాహితుడైన అతడు తరచుగా బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన 24 ఏళ్ల వివాహిత మహిళ ఫాతిమా నుస్రత్(Fatima Nusrat)తో నూర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ప్రేమలోపడ్డారు.కాగా, ప్రియుడైన నూర్‌ను పెళ్లాడేందుకు బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా నుస్రత్ 15 రోజుల కిందట అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి ధర్మానగర్ చేరుకుంది.
అనంతరం వారిద్దరూ ఫుల్బరీలో కలిసి ఉంటుందన్నారు. అయితే బంగ్లాదేశ్ మహిళ గురించి స్థానిక పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసి 14 రోజులు జ్యుడీషియల్ (Judicial) కస్టడీకి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ప్రియుడు నూర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రియుడైన నూర్‌ను పెళ్లాడేందుకు బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా నుస్రత్ 15 రోజుల కిందట అక్రమంగా భారత్(India)లోకి ప్రవేశించి ధర్మానగర్ చేరుకుంది. అనంతరం వారిద్దరూ ఫుల్బరీలో కలిసి ఉంటుందన్నారు. అయితే బంగ్లాదేశ్ మహిళ గురించి స్థానిక పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ప్రియుడు నూర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.