Patalkot Express catch fire in UP, 13 people injured
Patalkot Express catch fire: పాతాల్కిట్ ఎక్స్ ప్రెస్ బోగీకి (Patalkot Express) మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. పంజాబ్ ఫిరోజ్ పూర్ నుంచి ఎక్స్ ప్రెస్ రైలు వస్తోంది. ఆగ్రా- ఝాన్సీ మధ్యలో గల భాందయి స్టేషన్ వద్ద మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి గల కారణం తెలియరాలేదు. 13 మందిలో ఏడుగురిని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మరో ఆరుగురిని మంటలు చెలరేగిన సమీప ప్రాంతంలో గల ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేస్తున్నారు.
రైలులో గల రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. మిగతా కోచ్‌లకు విస్తరిస్తాయనే భయంతో నాలుగు వేరు చేశాయని ఉత్తర మధ్య రైల్వే పీఆర్వో ప్రశస్తి శ్రీ వాస్తవ తెలిపారు. ఇంజిన్‌లోని నాలుగో కోచ్ జీఎస్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే 5 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నాయని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మాత్రం భయపడేలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో పాతాల్కిట్ ఎక్స్ ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగాయి. pic.twitter.com/ISgPNHQZuL