Trivikram: త్రివిక్రమ్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ.. కానీ హీరోగా కాదు?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా సినిమాలు నిర్మిస్తోంది. ఇక ఇప్పుడు వీరి కొడుకు కూడా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. కాకపోతే.. హీరోగా కాదని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో వారసులు రావడం అనేది కామన్. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి వారసులు.. 24 క్రాఫ్ట్స్‌లో ఏదో ఓ విధంగా రాణిస్తునే ఉన్నారు. ముఖ్యంగా హీరోల కొడుకులు హీరోలుగా, దర్శకుల కొడుకులు కూడా హీరోలుగా ట్రై చేస్తున్నారు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ మాత్రం.. తండ్రి దారిలోనే వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇప్పటి వరకు త్రివిక్రమ్ కొడుకు గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చిందంటే.. రీసెంట్గా అతని ఫోటో ఒకటి బయటికి రావడంతో వైరల్‌గా మారింది.
త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, కొడుకు రిషీ మనోజ్‌తో దిగిన ఫోటోను సిరివెన్నెల సీతారామశాస్త్రీ కొడుకు, నటుడు రాజా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు తెలిపాడు. ఇందులో రిషి.. అచ్చు త్రివిక్రమ్ లానే కనిపిస్తున్నాడు. చూడ్డానికి హీరో కటౌట్ ఉన్నప్పటికీ.. రిషీ మాత్రం హీరో అవడట. ఈ విషయంలో ఈ మధ్యనే త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య క్లారిటీ ఇచ్చింది. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తన కొడుకు గురించి చెప్పుకొచ్చింది సాయి సౌజన్య.
రిషీకి దర్శకత్వం అంటే ఇష్టమని.. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. దీంతో తండ్రిలాగే రిషీ కూడా డైరెక్టర్‌గా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే.. ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.