»Virat Kohli Bowling Kohli Bowled After 8 Years Video Viral
Virat Kohli Bowling : 8 ఏళ్ల తర్వాత బౌలింగ్ వేసిన కోహ్లీ.. వీడియో వైరల్
ఎనిమిదేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ టోర్నీలో బౌలింగ్ వేశాడు. బంగ్లాదేశ్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హార్థిక పాండ్యాకు గాయం అయ్యింది. దీంతో పాండ్యా ఓవర్‌ను కోహ్లీ ఫినిష్ చేశాడు. కోహ్లీ బౌలింగ్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సచిన్ టెండూల్కర్ తర్వాత పరుగుల రారాజుగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తన బ్యాటింగ్‌తో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ బ్యాటర్‌గా అందరికీ తెలుసు. అయితే కోహ్లీ బౌలింగ్ (Kohli Bowling) కూడా చేస్తాడనే సంగతి చాలా మంది తెలియదు. కెరీర్ మొదట్లో కోహ్లీ బౌలింగ్ చేస్తుండేవాడు. కెప్టెన్ అయ్యాక బౌలింగ్ చేయడం ఆపాడు. తాజాగా వన్డే ప్రపంచకప్ 2023 (Odi World Cup-2023) టోర్నీలో నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతోంది. పూణేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ బౌలింగ్ చేశాడు.
బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా (TeamIndia) మొదట బౌలింగ్ చేసింది. అయితే 9వ ఓవర్లో బౌలింగ్ వేసిన హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) మూడో బంతికి జారి పడ్డాడు. ఆ సమయంలో పాండ్యా ఎడమ కాలుకు తీవ్రంగా గాయమై నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసినప్పటికీ హార్దిక్ పాండ్యా లేచి నిలబడలేకపోయాడు. దీంతో హార్ధిక్ పాండ్యాను బయటకు పంపారు. ఇక ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీ (Virat Kohli) వేశాడు.
మూడు బంతులు వేసిన కోహ్లీ రెండు పరుగులు ఇచ్చాడు. వన్డే ప్రపంచ కప్ (World Cup)లో విరాట్ కోహ్లీ దాదాపు 8 ఏళ్ల తర్వాత బౌలింగ్ చేయడం విశేషం. ఆఖరి సారి కోహ్లీ 2015 వన్డే ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసిన కోహ్లీ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బౌలింగ్ వేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతున్నాయి.