»Sensex Falls 512 Points October 18th 2023 Bse Stock Market India
Stock market: 512 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..మార్కెట్లకు ఏమైంది?
భారత స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం భారీ నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. US ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయాలతోపాటు ఆసియా మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకనొక దశలో సెన్సెక్స్(sensex), బ్యాంక్ నిఫ్టీ 500కుపైగా పాయింట్లను కోల్పోయింది.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12:35 గంటలకు సెన్సెక్స్ 512.55 పాయింట్లు క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 132.05 పాయింట్లు తగ్గింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్(sensex) 69 వేల 900 ఎగువన కొనసాగుతుండగా..నిఫ్టీ 19,600 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిప్టీ మిడ్ క్యాప్ సూచీలు సైతం 500, 350 పాయింట్లకుపైగా క్షీణించాయి. అయితే US ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఫెడరల్ ఫండ్స్ రేటును కొనసాగించడం, ట్రెజరీ ఈల్డ్‌లు పెరగడం వంటి అంచనాలతో బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను ప్రతికూల స్థితికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక దశలో 1178 షేర్లు పురోగమించగా, 1811 షేర్లు క్షీణించాయి.
కానీ ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ స్టాక్‌లు బలహీనమైన దేశీయ మార్కెట్ మధ్య గ్రీన్(green)లో ట్రేడ్ అయ్యాయి. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ నిఫ్టీ 50 లాభపడిన వాటిలో ఉన్నాయి. మరోవైపు మధ్యప్రాచ్యం నుంచి సరఫరా అంతరాయాల గురించి ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలను బ్యారెల్‌కు దాదాపు $92కి పెంచాయి. దీంతో భారతదేశం వంటి ముడి చమురు దిగుమతిదారులకు ప్రతికూలంగా మారనుంది. ఈ క్రమంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. US ట్రెజరీ ఈల్డ్‌లు మంగళవారం 16, 17 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 సంవత్సరాల ట్రెజరీ నోట్ 13.7 బేసిస్ పాయింట్లు పెరిగి 4.846%కి చేరుకుంది. ఇది 2007 తర్వాత అత్యధిక ముగింపుగా ప్రకటించారు.