»Same Sex Marriage Is Legal In These 33 Countries How Economy Gets A Booster
Gay Marriage: 34 దేశాల్లో స్వలింగ వివాహం చట్టబద్ధం.. భారీగా పెరిగిన వాటి ఆదాయం
స్వలింగ వివాహాలపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం మిశ్రమ తీర్పును వెలువరించింది. దీనికి భారతదేశంలో చట్టపరమైన గుర్తింపు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Gay Marriage: స్వలింగ వివాహాలపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం మిశ్రమ తీర్పును వెలువరించింది. దీనికి భారతదేశంలో చట్టపరమైన గుర్తింపు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, అమెరికాతో సహా ప్రపంచంలోని 34 దేశాల్లో స్వలింగ వివాహం గుర్తించబడింది. అదే సమయంలో, దాని ఎకానమిక్ ఇంపాక్ట్ కూడా మెరుగ్గా కనిపించింది. తైవాన్లో స్వలింగ వివాహం చట్టబద్ధంగా ప్రకటించబడినప్పుడు.. దేశంలో ఉన్న అనేక బహుళజాతి కంపెనీలు దాని ఎకానమిక్ ఇంపాక్ట్ గురించి మాట్లాడాయి. స్వలింగ జంటలు.. సాధారణ జంటలకు సమానమైన హక్కులను పొందాలి. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేయడం వల్ల స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందించవచ్చు.
కొన్ని సంవత్సరాల క్రితం UCLA స్కూల్ ఆఫ్ లా, విలియమ్స్ ఇన్స్టిట్యూట్లోని సీనియర్ న్యాయవాది క్రిస్టీ మల్లోరీ, ఆమె బృందం ఒక పరిశోధనను నిర్వహించింది. ఈ పరిశోధనలో అమెరికాలో ఒకే స్వలింగ జంటల వివాహ ఖర్చులు అంచనా వేయబడ్డాయి. పరిశోధన ప్రకారం స్వలింగ జంటలు తమ పెళ్లి కోసం చాలా ఖర్చు చేస్తారు. దీని వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపు వస్తుంది. ఈ రకమైన వివాహం ద్వారా రాష్ట్ర , స్థానిక సంస్థలు పన్ను ఆదాయంలో ప్రయోజనం పొందుతాయి. దీంతోపాటు టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని రాష్ట్రాల్లో వివాహం ఆమోదించబడిన తర్వాత మొత్తం 2.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందవచ్చు. ఇందులో రాష్ట్ర, స్థానిక పన్ను ఆదాయం వాటా 184.7 మిలియన్ డాలర్లు. అలాగే 13,000 మంది ఉద్యోగాలు లభించవచ్చు. 2015లో అమెరికాలో 1,23,000 స్వలింగ జంటలు వివాహం చేసుకున్నారని ఓ నివేదక తెలిపింది. ఈ వివాహాలు రాష్ట్ర, స్థానిక ఆర్థిక వ్యవస్థకు సుమారు 1.58 బిలియన్ డాలర్ల పుష్ అప్ అందించాయి. పన్ను ఆదాయం సుమారు 102 మిలియన్ డాలర్లు. అలాగే, 18,900 మందికి ఉద్యోగాలు లభించాయి.
స్వలింగ వివాహం ఎకానమిక్ ఇంపాక్ట్ స్వల్పకాలంలో కనిపిస్తుంది. ఈ రకమైన వివాహంతో దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త గ్యారీ బెకర్ మొదటిసారిగా 1973లో వివాహం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి మాట్లాడారు. వివాహిత జంటలు తమ సమయాన్ని, డబ్బును చక్కగా నిర్వహించుకోగలరని ఆయన చెప్పారు. ఆర్థికంగా, భారం పూర్తిగా ఎవరిపైనా పడదు. ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన తెలిపారు.