స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, తనపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని రష్మీ తెలిపింది. ప్రమీల మిశ్రా భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తన వెంట ఉంటాయంది. తన గ్రాండ్ మదర్ ను తలచుకుంటూ రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.