ప్రముఖ హీరో వెంకటేష్ యాక్ట్ చేసిన సైంధవ్ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది అతిపెద్ద డీల్ జాగ్రత్తగా డీల్ చేయండనే డైలాగ్ తో వీడియో మొదలవుతుంది. ఇక ఫైట్స్ మాత్రం మాములుగా లేవు. దీంతో పాటు వెంకీ లుక్ కూడా క్రేజీగా అనిపిస్తుంది. మరి ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) యాక్ట్ చేసిన 75వ చిత్రం సైంధవ్ పాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఓ యజమానికి కుడి భుజంగా ఉన్న నవాజుద్దీన్ సిద్ధిఖీ అక్రమ ఆయుధాలు మొదలైన వాటితో కూడిన కంటైనర్‌ను రవాణా చేయడానికి పెద్ద డీల్ కుదుర్చుకుంటాడు. కానీ ఆ ఓడను స్వాధీనం చేసుకుంటారు. అప్పుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపడానికి హీరో ఎంట్రీ ఇస్తాడు. వాడు సైకోరా రాడురా అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటాడు. ఆ క్రమంలో ఎంట్రీ ఇచ్చిన వెంకీ అదిరిపోయే ఫైట్స్ చేస్తూ రక్తపాతం సృష్టిస్తాడు. అంతేకాదు వెళ్లే ముందు చెప్పి వెళ్లా అయినా వినలేదు. అంటే భయం లేదని అర్థం. లేక్క మారుద్ది నా కొడుక్కుల్లారా అంటూ వెంకీ ఓ క్రేజీ డైలాగ్ చెబుతాడు. దీంతో ఈ చిత్రం మరింత మాస్ యాక్షన్ మూవీగా అనిపిస్తుంది. అంతేకాదు ఫైట్స్ మాత్రం నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. మరికొన్ని ఉత్కంఠతో కూడిన సీన్స్ కూడా ఉన్నాయి.
ఈ చిత్రానికి HIT ఫ్రాంచైజీకి పేరుగాంచిన శైలేష్ కొలను(sailesh kolanu) దర్శకత్వం వహించగా.. ఇది జనవరి 13, 2024న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టీజర్లో టెర్రరిజం, డ్రగ్స్ వంటి అంశాలను చూపించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి సైంధవ్‌ను నిర్మించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా, జయప్రకాష్లు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.