»Telanagana Assembly Elections Worry Among Dsc Candidates Will The Exams Be Postponed
DSC Exams: తెలంగాణ డీఎస్సీ పరీక్షలు వాయిదా
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగా ప్రకటించగా.. డీఎస్సీ, పోలింగ్ ఒకే రోజు కావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.
DSC Exams:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. ఈ కారణంగా డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగా ప్రకటించగా.. డీఎస్సీ, పోలింగ్ ఒకే రోజు కావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. అక్టోబరు 21 వరకు డీఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు నిర్ణీత ఫీజును అక్టోబర్ 20లోగా చెల్లించి అక్టోబర్ 21లోగా దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1000 చెల్లించాలి.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా విద్యాశాఖ డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్, అర్హతలను ప్రకటించింది. ఆన్లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ సెప్టెంబర్ 20న అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. సబ్జెక్టుల వారీగా డీఎస్సీ పరీక్ష తేదీలను నవంబర్ 20 నుంచి 30 వరకు ఖరారు చేశారు.కానీ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో దశ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తారు.