తెలంగాణ(Telangana)లో అధికార పార్టీ బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగలుతున్నాయి. కీలక నాయకులు కారుకు గుడ్‌బై చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్హైదరాబాద్(Greater Hyderabad)లో పలువురు నేతలు అధికార పార్టీని వీడుతుండగా.. ఇంకొందరూ అదే దారిలో ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డినగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్నరామ్మోహన్గౌడ్ (Rammohan Goud) దంపతులు, కంటోన్మెంట్ సీనియర్ నేత శ్రీగణేశ్లు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామ్మోహన్‌గౌడ్ ఉద్యమకాలం నుంచి నాటి టీఆర్‌ఎ్‌సలో ఉన్నారు.
2018 ఎన్నికల్లో పార్టీ తరఫున ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2015లో ఆయన సతీమణి లక్ష్మీప్రసన్నగౌడ్ బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2020 ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూశారు. బీఆర్ఎస్లో చేరిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (MLA Sudhir Reddy) వల్లే ఓడిపోయామని పలుమార్లు రామ్మోహన్‌గౌడ్ సన్నిహితుల వద్ద వాపోయారు. ఎన్నికల్లో సుధీర్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు ఆయన విముఖంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్(Congress)లో చేరినట్టు తెలుస్తోంది.
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని ఆయన కూడా ఖండించడం లేదు. బీజేపీ (BJP)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.శేరిలింగంపల్లి(Serilingampally)లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.అభ్యర్థిత్వం ఆశించిన పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాదాపూర్, హఫీజ్‌పేట డివిజన్ల కార్పొరేటర్లు పూజితా జగదీశ్వర్‌గౌడ్ (Jagdeeshwar Gowd) దంపతులు అధికార పార్టీ నుంచి బయటకు వెళ్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.