»Parents Who Were Out Side At Mumbai Child Died After Falling From The Window
Child died: బయటికెళ్లిన పేరెంట్స్..కిటికీ నుంచి పడి చిన్నారి మృతి
ఓ భవనంలోని కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత చెందింది. ఈ విషాద ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. అయితే చిన్నారి పడిన క్రమంలో వారి పేరెంట్స్ బయటకు వెళ్లడం విశేషం. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Parents who were out side at mumbai Child died after falling from the window
ముంబయి(mumbai)లో దారుణం చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారి ఇంట్లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు జారి పడిపోయి కన్నుమూసింది. అయితే చిన్నారి వారి ఇంటి కిటికీ నుంచి జారి పడటం గమనార్హం. ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు ఎవరూ కూడా లేరు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం. ముంబయిలోని వైకే నగర్లోని బాచీరాజ్ లైఫ్ స్పేస్ లో ఓ జంట తమ కుమార్తెతో కలిసి అద్దెకు ఉంటుున్నారు. అది 19 అంతస్తుల భవనం. కాగా వీరు నాలుగో అంతస్తులో ఉంటున్నారు. చిన్నారి పేరు దర్శిణి(4). కాగా తల్లి మణి, తండ్రి సురేష్. సురేష్ పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో చిన్నారిని ఇంట్లో నిద్రపుచ్చారు. సురేష్ ని రైల్వే స్టేషన్ వద్ద దింపేందుకు మణి కూడా వెళ్లారు. అతనిని అక్కడ డ్రాప్ చేసి, ఇంటికి వచ్చి చూసే సరికి చిన్నారి లేదు.
పాప కోసం వెతుకుతున్న క్రమంలో కింద చాలా మంది గుమ్మిగూడి ఉండటాన్ని గమనించింది. వెళ్లి చూడగా చిన్నారి దర్శిణి రక్తపు మడుగులో పడి ఉంది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఇక చిన్నారి(child) చనిపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే, చిన్నారి కళ్లను మాత్రం వారు దానం చేయడం విశేషం. కాగా వారు బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి నిద్రలేచి ఉండొచ్చని వారి పేరెంట్స్ భావిస్తున్నారు. తల్లి తండ్రులను వెతికే క్రమంలో కిటికీలో నుంచి పడిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు. కాగా స్థానికంగా ఈ సంఘటన విషాదం నింపింది.