»120 Crores To Kamal Haasan For Indian 3 Directed By Shankar
KamalHaasan: ఇండియన్ 3 కోసం కమల్ హసన్‌కు రూ.120 కోట్లు?
దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2. ఇది డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది. త్వరలోనే పార్ట్ 3 కూడా ఉంటుందని తెలుస్తుంది. దీని కోసం కమల్ ఏకంగా రూ.120 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
120 crores to Kamal Haasan for Indian 3, directed by Shankar
Kamal Haasan: ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan), దర్శకుడు శంకర్(Shankar) కాంబినేషన్లో వచ్చిన కమర్షల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం భారతీయుడు. 1996లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వాస్తవానికి భారతీయుడు(Bharatheeyudu) చిత్రం మొదటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా చెప్పవచ్చు. 13 సంవత్సరాల తర్వాత, లెజెండరీ కాంబోలో ఆ హిట్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2(Indian 2) ను తెరకెక్కిస్తున్నారు. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. తరువాత దీని నుంచి తప్పుకున్నారు. ఇక రంగంలోకి లైకా ప్రొడక్షన్స్ వచ్చి చేరింది. సినిమా మొదలైనప్పటి నుంచి అనేక అడ్డంకులు వచ్చాయి.
ఒక సారి వేసిన సెట్ కాలిపోయి ప్రాణనష్టం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులు నడుమ చిత్రానికి అండగా నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వచ్చి కొ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక అప్పటినుంచి సినిమా శరవేగంగా పూర్తి అయింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుకుటుంది. అయితే సినిమా పూర్తి అయిన తరువాత దీనికి సిక్వెల్ తీయడానికి అవకాశం ఉందని డైరెక్టర్ చెప్పారట. దాంతో చిత్ర యూనిట్ కూడా అతని ఆలోచనతో సమ్మతించారు. తాజాగా ఇండియన్ 3(Indian 3) చిత్రం గురించి చర్చ నడుస్తోంది.
ఇప్పటికే పార్ట్ 2 కోసం తీసిన కొంత ఫూటేజ్ పార్ట్ 3కి సరిపోతుందని సినిమా పూర్తి కావాలంటే మరో 30 రోజుల పాటు షూటింగ్ చేస్తే సరిపోతుందని డైరెక్టర్ శంకర్ చెప్పారట. ముందే పార్ట్ 3కి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ మళ్లీ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇండియన్ 3 కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ పార్ట్ కోసం కమల్‌కు ఏకంగా రూ.120 కోట్లు చెల్లిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రం తరువాత హెచ్ వినోద్ డైరెక్షన్లో #KH233 చిత్రం, మణిరత్నం దర్శకత్వంలో #KH234 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.