»Bunny Wife Sneha Reddy Who Went To Tirumala On Foot Netizens Praise
Sneha reddy: కాలినడకన తిరుమల వెళ్లిన బన్నీ వైఫ్..నెటిజన్ల ప్రశంస
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తాజాగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని కాలినడకన దర్శించుకున్నారు. అయితే ఆమె ఎలాంటి హంగామా లేకుండా సరదాగా ఆమె మాత్రమే వచ్చి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకోవడం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Bunny wife sneha reddy who went to Tirumala on foot netizens praise
టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి(sneha reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక స్టార్ హీరోకు భార్యగా ఉన్న స్నేహారెడ్డి చాలా సింపుల్ ఉండటాన్ని చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈమె తాజాగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే బన్నీతోపాటు రాకుండా కేవలం తను మాత్రమే సాధారణ మహిళ మాదిరిగా కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే స్నేహా రెడ్డి దీపాలు వెలిగిస్తూ మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం చూసిన పలువురు మీరు గ్రేట్ మేడమ్ అని పొగుడుతున్నారు. ఎలాంటి హాడావిడి లేకుండా తిరుమలకు వచ్చి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం పట్ల బన్నీ ఫ్యాన్స్ స్నేహారెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటివల అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లి వచ్చారు. ప్రస్తుతం బన్నీ పుష్ప2 షూటింగ్లో భాగంగా బిజీగా ఉన్నారు.
స్నేహారెడ్డి తన ప్రాథమిక విద్య హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేయగా..ఆ తర్వాత ఆమె కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించడానికి USA వెళ్లింది. ఆ తరువాత ఆమె USAలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేసింది. అయితే అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ఓ కార్యక్రమంలో చూసి మురిసిపోయి ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. స్నేహ అతని ప్రతిపాదనను అంగీకరించింది. దీంతో వారు మార్చి 6, 2011న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అల్లు అయాన్ అనే కుమారుడు, అర్హ అల్లు అనే కుమార్తె ఉన్నారు. స్నేహారెడ్డి తల్లిదండ్రులు కవితారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్. ఆమె తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక వ్యాపారవేత్త, SCIENT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SIT) చైర్మన్. ఆమెకు నాగు రెడ్డి అనే సోదరి కూడా ఉంది.