»India Stands By Israel Israel Pm Netanyahu Call To Pm Modi
Israelకు అండగా భారత్..మోడీకి అక్కడి పీఎం ఫోన్
ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో పీఎం మోడీ ఈ విషయంపై స్పందించారు. భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
India stands by Israel Israel pm netanyahu call to pm Modi
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మంగళవారం నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దును స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత ప్రధాని మోడీ(modi)కి ఫోన్ చేశారు. ఆ యుద్ధం పరిస్థితుల గురించి సమాచారం అందించారు. ఈ క్రమంలో స్పందించిన ప్రధాని మోడీ ఇజ్రాయెల్(Israel pm netanyahu)కు భారత్ అన్ని విధాలుగా అండగా ఉంటందని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ సమాచారాన్ని ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గురించి సమాచారం అందించినట్లు గుర్తు చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిస్తారని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో పలు మానవ హక్కుల సంఘాలు సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో రెండు వైపులా కలిపి దాదాపు 1600 మంది చనిపోయారు. దశాబ్దా కాలంలో మొదటిసారిగా ఇజ్రాయెల్ వీధుల్లో ఇటువంటి రక్తపాతం కనిపించింది. ప్రతిస్పందనగా గాజాలోని అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1,500 మంది హమాస్ టెర్రరిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు ఇజ్రాయెల్(Israel)సైన్యం తెలిపింది. దక్షిణ భాగంలోని చాలా ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అనేక మంది సైనికులు, పౌరులను బందీలుగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్ దాడి తర్వాత గాజాలోని హమాస్, ఇతర తీవ్రవాద గ్రూపులు 150 మంది సైనికులు, పౌరులను బందీలుగా పట్టుకున్నాయి. 3,00,000 అదనపు ఇజ్రాయెల్ సైనికులను మోహరించారు. దాడిని ఆపేందుకు గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఆ క్రమంలో గాజా సమీపంలోని 12 కంటే ఎక్కువ నగరాల నుంచి వేలాది మంది ఖాళీ చేయబడ్డారు. అదే సమయంలో గాజాలో నిరంతర వైమానిక దాడుల కారణంగా వేలాది మంది నివాసితులు తమ ఇళ్లను విడిచిపెట్టారు. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రకారం గాజాలో 1,87,500 మందికి పైగా ప్రజలు(people) అక్టోబర్ 7న ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది.