మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018లో ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని పిటిషన్ లో రాఘవేంద్రరాజు తెలిపారు.ఆయన వేసిన పిటిషన్ (Petition) కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారి(Returning Officer)కి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది. దీంతో, తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన తరుణంలో శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది.