మునుపెన్నడూ సాధ్యం కాని రీతిలో బీజేపీ గుజరాత్ లో వరుసగా ఏడోసారి అధికారం చేపట్టింది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే సాధ్యమైంది. గతంలో కన్నా అత్యధికంగా 156 అసెంబ్లీ సీట్లు గెలవడానికి కారణం మోదీనే. దీనికి గుర్తుగా ఓ స్వర్ణకారుడు మోడీ విగ్రహాన్ని 156 గ్రాముల బంగారంతో తయారుచేశాడు. మోదీపై అభిమానంతోనే బంగారు విగ్రహం తయారు చేశానని గుజరాత్ కు చెందిన స్వర్ణకారుడు తెలిపాడు. స్వర్ణమయమైన మోడీ విగ్రహం ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ విగ్రహం ఎలా తయారుచేశారు? ఎక్కడుంది? అనే వివరాలు తెలుసుకుందాం రండి.
గుజరాత్ లోని సూరత్ కు చెందిన సందీప్ జైన్ స్వర్ణకారుడు. ఆయనకు మోదీ అంటే విపరీతమైన అభిమానం. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లతో అఖండ విజయం సాధించింది. దీనికి గుర్తుగా 156 గ్రాముల మేలిమి బంగారంతో నరేంద్ర మోదీ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేశాడు. ఈ విగ్రహాన్ని దాదాపు 15 నుంచి 20 మంది కళాకారులు కొన్ని రోజుల పాటు కష్టపడి రూపొందించారు.
ఈ స్వర్ణ విగ్రహాన్నీ ఇటీవల ముంబైలో జరిగిన బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శనలో ఈ స్వర్ణ విగ్రహామే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ విగ్రహ తయారీకి అయిన ఖర్చు రూ.11 లక్షలు అయినట్టు తెలుస్తున్నది. అయితే ఈ విగ్రహాన్ని అమ్మకానికి కాదు కేవలం ప్రదర్శన కోసమే తయారు చేసినట్లు సందీప్ జైన్ తెలిపాడు.
#surat 156 gram gold statue of Prime Minister Narendra Modi made in Surat. A statue was made for winning 156 seats in Gujarat, for that 15 to 20 artisans worked hard and estimated price is 11 lakhs. #NarendraModipic.twitter.com/IvVHUwsorB