KDP: బద్వేల్లోని బ్రహ్మంగారి మఠం వద్ద ఉన్న మున్సిపాలిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సందర్శించారు. నీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించి, క్లోరిన్ పరీక్ష నిర్వహించి, నీటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలని, ప్లాంట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచనలు చేశారు.