TG: స్మార్ట్ఫోన్ ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. వారి మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు. అలా ఎప్పుడూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.