జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. దీని కోసం కొందరు చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. అయితే కొందరికి లక్ష్యం ఒకటి ఉంటుంది. కానీ వేరే ఫీల్డ్‌లో రాణిస్తుంటారు. ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించిన పారుల్ చౌదరి కూడా ఇలాంటి కోవకి చెందినదే. పారుల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి రైతు కావడంతో పారుల్ పొలం పనుల్లో పరుగెత్తేది. క్రీడల్లోకి వెళ్లాలని ఆలోచన కూడా పారుల్కి లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలనేది పారుల్ కోరిక. దీనికోసమే కష్టపడి చదివేది. ఓ రోజు పారుల్ స్కూల్లో పరుగు పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొనమని తండ్రి అడిగాడు. తండ్రి మాటను గౌరవించిన పారుల్ ఎలాంటి బూట్లు వేసుకోకుండా పోటీల్లో పాల్గొని.. రెండు పతకాలు సాధించింది. అలా స్కూల్లో మొదలైన తన పరుగు ప్రయాణం ఆసియా క్రీడల వరకు వచ్చింది.
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించిన పారుల్ విదేశాల్లో శిక్షణ తీసుకోవడంతోపాటు తన గ్రామంలోని పొలాలు, చెరకు తోటల్లో కూడా పరిగెత్తింది. 2016లో జాతీయ అథ్లెటిక్స్ శిబిరానికి ఎంపిక అయి తన సత్తా ఏంటో చూపించింది. అలాగే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2019లో కాంస్యంతో ప్రారంభించిన పారుల్.. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భాగంగా.. 5000 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 3000 మీటర్ల పరుగు పందెంలో రజతం సాధించింది. నాన్న మాట కాదనలేక పోటీల్లో పరిగెట్టిన పరుగే.. ఈ రోజు జీవితం అవుతుందని పారుల్ అస్సలు అనుకోలేదు. 3000 మీటర్ల స్టీఫుల్ స్టేజ్‌లో తక్కువ సమయంలో పరిగెత్తి, తొలిసారి ఫైనల్‌కు వెళ్లిన భారత్ అథ్లెటిక్‌గా రికార్డు సృష్టించింది. 2024లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. ఈ ఒలింపిక్స్‌లో పారుల్ పతకాలు సాధించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ పారుల్.
ఇది కూడా చదవండి: Asian games 2023: ఒకప్పుడు కూలీ..ఇప్పుడు ఆసియా పతక విజేత