Golden Temple రాహుల్ గాంధీ.. దర్శనం చేసుకొని, సేవ, గిన్నెలు కడుగుతూ
స్వర్ణ దేవాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిన్నెల కడిగారు. ఇది వ్యక్తిగత పర్యటన, దైవ సందర్శన ప్రోగ్రామ్ అని.. ఎవరూ రావొద్దని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కార్యకర్తలను కోరారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత సచ్‌ఖండ్ శ్రీ హర్ మందిర్ సాహిబ్ వద్ద ‘సేవా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న గిన్నెలను తోటి కాంగ్రెస్ నేతలతో కలిసి కడిగారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ చక్కర్లు కొడుతోంది. పంజాబ్‌లో రాహుల్ గాంధీ పర్యటన ఆధ్మాత్మికం, వ్యక్తిగత టూర్ అని పంజాబ్ కాంగ్రెస్ నేత ఒకరు మీడియాకు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఏ మాత్రం సమయం దొరికినా చాలు జనంతో మమేకం అవుతున్నారు రాహుల్ గాంధీ. ఇటీవల ఢిల్లీలో కూలీలతో కూలీగా మారాడు. అలాగే రైతుల వద్దకు వచ్చి అన్నదాతగా మారాడు. ఇప్పుడు స్వర్ణ దేవాలయం వచ్చి గిన్నెలు కడుగుతూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వడ్రంగి పనిచేసే చోట కూడా ఆగి ముచ్చటించారు.
రాహుల్ పంజాబ్ పర్యటన వ్యక్తిగతం అని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు. ఆధ్మాత్మిక సందర్శన, దైవ చింతన కోసం రాహుల్ పంజాబ్ వచ్చారని.. ఇదీ వ్యక్తిగత పర్యటన అని.. అతని ప్రైవసీని గౌరవిద్దాం అని.. రాహుల్ పర్యటనకు కార్యకర్తలు హాజరు కావొద్దని సూచించారు. మీ మద్దతు మాత్రం ఇవ్వాలని కోరారు. మరోసారి వచ్చిన సమయంలో రాహుల్‌ను కలిసే అవకాశం ఉంటుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
రాహుల్ పంజాబ్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ అంశం చర్చకు వచ్చింది. 2015 డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకు్ననారు. పంజాబ్‌లో మాన్ ప్రభుత్వం రాజకీయాలను మలినం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. చిత్రంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వాములు.. కానీ పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉండగా.. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది.