Komatireddy Venkat Reddy Made Sensational Comments
Komatireddy Venkat Reddy: సీఎం పదవీ గురించి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) మాట్లాడారు. కార్యకర్తల సమావేశంలో సీఎం సీఎం అని నినాదించగా.. నకిరేకల్‌లో వేముల వీరేశంను గెలిపించాలని కోరారు. అలా అయితే తాను ముఖ్యమంత్రి పదవీ చేపట్టినంతా ఫీలవుతా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం (CM) అయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. సీఎం బెడ్ రూమ్‌లోకి వెళ్లేంత స్వేచ్చ కార్యకర్తలకు ఉంటుందని తెలిపారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వేముల వీరేశం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy) కలిశారు. వీరేశంతో నకిరేకల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై కోమటిరెడ్డి (Komatireddy) మండిపడ్డారు. మేం గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెలిచాడని.. ఇప్పుడు తమను దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. జడ్పీటీసీగా గెలిపిస్తే పెద్ద పదవీ ఎందుకు అన్నాడు.. ఎమ్మెల్యే చేశాం.. రెండుసార్లు గెలిపిస్తే.. విశ్వాసం లేకుండా ఉన్నాడని విరుచుకుపడ్డారు.
నకిరేకల్‌లో రేపటి నుంచి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయాలని వెంకట్ రెడ్డి కోరారు. వీరేశంకు అన్నిరకాలుగా సహకారం అందిస్తానని తెలిపారు. నల్గొండ, నకిరేకల్ రెండు కళ్ల లాంటివని తెలిపారు. ఈ సారి సూర్యాపేటలో జగదీశ్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు. రెండుసార్లు గెలిచి ఏం చేశాడని అడిగారు. స్కూటర్, కారు లేని జగదీశ్.. వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని అడిగారు. ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.