తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy)స్టైలే వేరు.ఆయన ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన మాటల్లో, చేతల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి మంత్రి మల్లన్న తన మార్క్ చూపించారు. ఆయన మాటలు, చేష్టలు అందరినీ అలరిస్తుంటాయి. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అయ్యాయి. వాటిపై చాలా మిక్స్ క్రియేట్ వచ్చాయి. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. డీజే టిల్లు పాట (DJ Tillu Song) కు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు.
70 ఏళ్లు వచ్చినా నిత్య యువకుడిలా హుషారుగా డ్యాన్స్ చేశారు.కుర్రకారును ఉర్రుతలూగించారు. వరల్డ్ హార్ట్ డే(World Heart Day)లో భాగంగా హెల్త్ పై అవగాహన కల్పించేందుకు మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్టేజ్ పైన డీజే టిల్లు టైటిల్ సాంగ్ రాగానే అక్కడున్న వారితో ఆయన హుషారుగా డ్యాన్స్ చేశారు.స్టేజీ దద్దరిల్లేలా మాస్ స్టెప్పులేశారు సినిమాలోని సిగ్నేచర్ స్టెప్పులు వేసి అక్కడున్న వారిని ఉత్సాహ పరిచారు. అనంతరం స్టేజ్ కిందకు వచ్చి అందరితో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.