»Ulefone Armor 24 Smartphone Comes With 22000 Mah Battery
Ulefone Armor 24: 22000 Mah బ్యాటరీతో మొబైల్.. కాదు పవర్ హౌస్
మొబైల్ లవర్స్ కోసం కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్మోర్ 24 అనే మొబైల్లో జంబో బ్యాటరీ ఇచ్చారు. ఒక్కాసారి ఛార్జ్ చేస్తే చాలు.. కనీసం వారం రోజుల పాటు వస్తోంది.
Ulefone Armor 24 Smartphone Comes With 22000 Mah Battery
Ulefone Armor 24: 22000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.. అది మొబైల్ కాదు పవర్ హౌస్ అవుతుంది. కొన్ని పవర్ బ్యాంక్స్ కెపాసిటీ 10000 ఎంఏహెచ్ ఉంటాయి. అంటే దాని కన్నా డబుల్ చార్జీంగ్ ఇస్తోంది. చైనాకు చెందిన టెక్ కంపెనీ యులేఫోన్ (Ulefone Armor 24) ఈ మొబైల్‌ను ఆవిష్కరించింది. ఆర్మోర్ 24 పేరుతో మొబైల్ వస్తోంది. అలీ ఎక్స్ ప్రెస్‌లో అందుబాటులో ఉంది. ఇండియాలో ఆ కంపెనీపై నిషేధం ఉంది. సో.. ఇక్కడ మొబైల్ కొనే అవకాశం లేదు. ధర మాత్రం రూ.34 వేలుగానే ఉంది.
భారీ బ్యాటరీతో వస్తుండటంతో ఎమర్జెన్సీ లైట్ సిస్టమ్‌లా పనిచేయనుంది. 66 వాట్ల ఫాస్ట్ ఛార్జీంగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జీ చేస్తే కనీసం 7 రోజులపాటు పనిచేస్తోంది. మొబైల్ పవర్ బ్యాంక్‌గా కూడా వాడే వెసులుబాటు ఉంది. ఐ ఫోన్ 15లో యాక్షన్ బటన్ మాదిరిగా మొబైల్ ఒకవైపు బటన్ ఇచ్చారు. అవసరం అయినప్పుడు మొబైల్ ఎమర్జెన్సీ లైట్లా వాడుకోవచ్చు. మొబైల్లో దుమ్ము, నీరు చేరకుండా ఉండేందుకు ఐపీ68 రేటింగ్ ఇచ్చారు.
ఆర్మోర్ 24లో 24 జీబీ ర్యామ్ 256 రోమ్ వేరియంట్ మాత్రమే ఉంది. 6.78 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ 5 రక్షణగా ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేటింగ్‌తో డిస్ ప్లే పనిచేస్తోంది. మీడియా టెక్ హీలియో జీ 96 ప్రాసెసర్ అమర్చారు. వర్చువల్ ర్యామ్ మరో 12 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. రెండు ఐఆర్ ఎల్ఈడీ ఉన్నాయి. ఐఆర్ బ్లాస్టర్తోపాటు మొబైల్ వెనక ప్యానెల్లో నైట్ విజన్ సపోర్ట్‌తో కూడిన 64 ఎంపీ కెమెరా, 64 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు. ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఇచ్చారు. సో.. ఈ ఫోన్.. మొబైల్ ప్రియులను ఆకట్టుకోనుంది. బ్యాటరీ, లైట్ ఎమర్జెన్సీ సమయంలో చక్కగా పనిచేయనున్నాయి.