YS Sharmila: నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొ లెక్క.. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్క వస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇది చాలా కామన్ అని చెప్పడం విడ్డూరం ఉంది. అర్హత లేనోళ్లకు, దొర అడుగులకు మడుగులు ఒత్తేటోళ్లకు పదవులు కట్టబెడితే కామన్ కాక మరేంటి? అని ధ్వజమెత్తారు. సో.. దీంతో ఇప్పటి వరకు ఏ సర్కార్ పరీక్ష పెట్టనట్టు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు కమీషన్ కాకమ్మ కథలు చెబుతుందని ఫైరయ్యారు.
ప్రశ్నాపత్రాలను అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారు చేయడం ఒక లెక్కనా? అని అడిగారు. బోర్డు పారదర్శకత పాటిస్తే పేపర్లు బయటకు ఎందుకు వస్తాయని అడిగారు. ఒకసారి పరీక్ష రద్దైన తర్వాత మరోసారి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని అడిగారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే.. కమీషన్ కి వచ్చిన నష్టం ఏంటి అని నిలదీశారు. అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కితే,పె ట్టిన పరీక్షలే న్యాయస్థానం రద్దు చేసిందంటే.. TSPSC పారదర్శకత ఏంటో అర్థమైందన్నారు. రెండు సార్లు పరీక్షలు రాసినా ఫలితం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుతో 2.33 లక్షల మంది నిరుద్యోగులు కనీళ్లు పెట్టుకుంటున్నారని గుర్తుచేశారు. వారి ఉసురు ఈ సర్కారుకు తగలకపోదన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను.. దొరల ప్రగతి భవన్ సర్వీస్ కమీషన్‌గా మార్చారని విరుచుకుపడ్డారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ ఇదేనని షర్మిల మండిపడ్డారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.