»Rains In Telangana Next Four Days Upto October 2nd 2023
Rains: తెలంగాణలో 4 రోజులు వర్షాలు
రాష్ట్రంలో ఇంకో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా వర్షాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Rains in Telangana next four days upto october 2nd 2023
తెలంగాణ(telangana)లో మరో నాలుగు రోజులు అనేక జిల్లాల్లో వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ క్రమంలో అక్టోబర్ 2 వరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతటా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్లోని అనేక చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. పంజాగుట్ట-ఖైరతాబాద్, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, అమీర్పేట్, టోలీచౌకి, రేతి బౌలి, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సహా అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. అయితే నిన్న వినాయకచవితి నిమజ్జనం కారణంగా అనేక చోట్ల వర్షంలోనే నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
ఇంకోవైపు ఏపీలో కూడా వర్షాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.