A huge fine to the gaming app Dream11 rs 40000 crore
డ్రీమ్11 పేరెంట్ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ పై జీఎస్టీ ఎగవేతపై భారీగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 28 శాతం జీఎస్టీ చెల్లించనందుకు పన్ను అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఈ సంస్థపై దాదాపు రెండింతల దావా రూ.40,000 కోట్ల వరకు వేసినట్లు తెలిసింది. ఇది ప్రస్తుతం పరోక్ష పన్నుల చరిత్రలో అతిపెద్ద దావా అని అంటున్నారు.
ఫాంటసీ స్పోర్ట్స్ మేజర్ డ్రీమ్11 FY22లో రూ.3,841 కోట్ల నిర్వహణ ఆదాయంపై రూ.142 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ పన్ను ఎగవేత ఆరోపణలపై 40కి పైగా స్కిల్-గేమింగ్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి Dream11 నిరాకరించింది. దేశంలోని ఫాంటసీ గేమింగ్ పరిశ్రమలో వాల్యుయేషన్, యూజర్ బేస్ పరంగా Dream11 అతిపెద్ద సంస్థ. ఈ స్టార్టప్ చివరిగా $8 బిలియన్లకు పైగా నిధులను సమీకరించింది. అంతేకాదు ఈ స్పోర్ట్స్ ఫాంటసీ ప్లాట్‌ఫారమ్‌లో 180 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఈ అంశంపై మరికొన్ని రోజుల్లో సుప్రీంకోర్టు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో GST కౌన్సిల్ సంస్థ ముఖ విలువపై 28 శాతం GST పన్నును విధించాలని నిర్ణయించింది.