Chandrababu’s Remand: స్కిల్ స్కామ్‌లో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రిమాండ్ పొడగించారు. మరో 11 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించారు. అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి. బెయిల్ పిటిషన్‌ను ఇదివరకే ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కేసులో బాబు ప్రమేయం లేదని క్వాష్ చేయాలని పిటిషన్ వేయగా.. హైకోర్టు కూడా కొట్టివేసింది. దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతకీ చంద్రబాబు ఇష్యూలో ఏం జరుగుతోంది..? కావాలనే అరెస్ట్ చేశారా? బెయిల్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటీ..?
రిమాండ్ పొడగింపు
చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంతలో ఏసీబీ కోర్టు మరోసారి చంద్రబాబు రిమాండ్ పొడగించింది. ఇప్పుడు 11 రోజుల సమయం ఇచ్చారు. దీంతో ఏం జరుగుతందనే చర్చ వచ్చింది. ఏసీబీ కోర్టు జడ్జీ హిమబిందు కక్షపూరితంగా వ్యవహరిస్తోన్నారా..? ఆమె వెనక ఎవరు ఉన్నారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సీఎం జగన్ కావాలనే ఇలా చేస్తున్నారని.. చంద్రబాబును ఇప్పట్లో బయటకు పంపించేందుకు ఇష్టంగా లేరని పొలిటికల్ సర్కిళ్లలో తెగ చర్చ జరుగుతోంది. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని.. బాబు కనీసం నెలరోజులైనా ఉండాల్సిందేనని సీఎం అనుకుంటున్నారని కొందరు ఆనలిస్టులు లెక్కలు వేస్తున్నారు. అందుకోసమే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఎంత ట్రై చేసినా బెయిల్ రావడం లేదని.. క్వాష్ కూడా కావడం లేదని చెబుతున్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ శతవిధలా ప్రయత్నిస్తోంది. కేసు చూస్తోన్న ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేసింది. మరోసారి దాఖలు చేసినప్పటికీ ఇవ్వలేదు. దీంతో జడ్జీ పర్సనల్‌గా తీసుకుంటున్నారా..? వీడియా కాల్లో చంద్రబాబు మాట్లాడారు. తనను ఇబ్బందికి గురిచేస్తున్నారని, నరకం అనుభవిస్తున్నానని కన్నీటి పర్యంతం అయ్యారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. నేరం చేసినట్టు కాదని.. జ్యుడిషీయల్ రిమాండ్‌లో ఉన్నారని న్యాయమూర్తి హిమబిందు స్పష్టంచేశారు. 14 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత.. 2 రోజుల సీఐడీ కస్టడీకి అనుమతిచ్చారు. సీఐడీ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. బాబుపై వేసేందుకు 120 ప్రశ్నలను సిద్ధం చేశారు. రెండు రోజుల్లో వీలైనంత సమాచారం తీసుకునే ప్రయత్నం చేశారు. బాబు స్పందించడం లేదని.. మరో 5 రోజుల కస్టడీ ఇవ్వాలని అంటున్నారు. ఆ తర్వాత కూడా ఏసీబీ కోర్టు జడ్జీ హిమబందు మరో 11 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చేలా లేరు. అందుకే బాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని డిసైడయ్యారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో.. సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కారు.
హిమబిందు లక్ష్యంగా కామెంట్స్
చంద్రబాబు తరఫున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఫేమస్ లాయర్ ఈయన.. అయినప్పటికీ బెయిల్ రావడం లేదు. ఎందుకంటే.. కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందుకోసమే కేసు నుంచి బయట పడటం లేదంటున్నారు. పొలిటికల్ కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయి. జడ్జీ హిమబిందు లక్ష్యంగా కామెంట్స్ వస్తున్నాయి. సీఎం జగన్ నియమించిన హిమబిందు.. ఆయన అనుకున్నట్టే పనిచేస్తోందని టీడీపీకి అనుకూలంగా ఉండే కొందరు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. సీఐడీ కేసు విచారణ జరిపే.. ఏసీబీ కోర్టు ఇంపార్టెంట్ అని, అందుకే హిమబిందు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని.. జడ్జీ తన పరిధి మేరకు వ్యవహరిస్తున్నారని వైసీపీకి చెందిన న్యాయవాదులు అభిప్రాయ పడుతున్నారు. ఇందులో రాజకీయాలకు తావులేదని.. ఏదో విమర్శించాలని.. తమ అధినేతపై బురద జల్లడం భావ్యం కాదన్నారు. అంతేకాదు జడ్జీ లక్ష్యంగా కామెంట్లు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
రాజేశ్ పరార్, ఢిల్లీలో నక్కిన లోకేశ్
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర, సీఐడీ విచారణలో కిలారు రాజేశ్ నారా లోకేశ్‌కు నగదు చెల్లింపులు చేశారని చెప్పారని నిన్న వార్తలు వినిపించాయి. చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించే రోజే లోకేశ్ ఢిల్లీ బాట పట్టారు. అతనితో రాజేశ్ ఉన్నాడు. ఆ మరుసటి రోజు అమెరికా వెళ్లిపోయారని తెలిసింది. లోకేశ్ ప్రమేయానికి సంబంధించి కూడా సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. రేపో, మాపో చినబాబు అరెస్ట్ తప్పదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో లోకేశ్ ఢిల్లీని వీడి రావడం లేదు. అక్కడ జాతీయ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని పైకి చెబుతున్నారు. లోన మాత్రం భయపడుతున్నారని.. ఎక్కడ అరెస్ట్ చేస్తారని బిక్కు బిక్కుమంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజమండ్రి జైలు స్నేహ బ్యారక్‌లో ఉన్న చంద్రబాబుతో ఈ రోజు ఫ్యామిలీ ములాఖత్ ఉంది. భువనేశ్వరి, బ్రాహ్మణి వస్తున్నారు. లోకేశ్ మాత్రం హస్తినకే పరిమితం అవుతున్నారు. వస్తే ఎక్కడ తనను అదుపులోకి తీసుకుంటారనే భయం లోకేశ్‌ను వెంటాడుతోంది.. అందుకే దూరంగా ఉంటున్నారని వైసీపీ ముఖ్య నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
శిక్ష పడాల్సిందే..?
ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ఏపీలో ఒకసారి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. స్కిల్ స్కామ్ నుంచి బయటపడేందుకు శతవిధలా ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. బాబు విడుదల కోసం టీడీపీ శ్రేణులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భద్రత అని, దోమల బెడద అని రకరకాల కారణాలు చెబుతున్నప్పటికీ ఏసీబీ కోర్టు అంతగా పట్టించుకోవడం లేదు. విచారణ జరగాల్సిందేనని.. దోషులకు శిక్ష పడాల్సిందేనని తేల్చిచెబుతోంది.