»Revanth Reddy Should Cancel The Government That Is Playing With The Career Of The Youth
Revanth Reddy: యువకుల కెరీర్‌తో ఆడుకుంటున్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది యువకులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వారి జీవితాలతో ఆడుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని, వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు ఈ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని అన్నారు.
Revanth Reddy should cancel the government that is playing with the career of the youth
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు, యువకుల కెరీర్‌తో ఆడుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ తీరు గురించి లేఖ రాశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరితో యువత, విద్యార్థులు నష్టపోతున్నారని రాసిన లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అన్నారు.
2015లో సింగరేణి నుంచి ఇంటర్మీడియట్ పేపర్ల మూల్యాంకనంలో తప్పిదాల వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అందులో గుర్తు చేశారు. దీంతోపాటు ఎంసెట్ పేపర్ లీకేజీ, ఏఈ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజీ, 10వ తరగతి పేపర్ లీక్, టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ పరీక్షల్లో పేపర్ల లీకేజీ వంటి కారణాలతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవస్థపై విద్యార్థులకు పూర్తిగా విశ్వాసం పోయిందన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వ వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదన్నారు. ఒక్క సమీక్షా సమావేశం జరగలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే నినాదంతో తెలంగాణ యువత(youth)ను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన గత తొమ్మిదేళ్లుగా ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు 30 లక్షల మంది యువకులు హాస్టళ్లలో ఉంటూ తల్లిదండ్రులు(parents) పంపిన డబ్బుతో కోచింగ్ సెంటర్లకు వెళ్లి పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం సానుభూతి చూపడంలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా పేపర్ లీకేజీ గతేడాది అక్టోబర్ 22న జరిగిన గ్రూప్-1 (ప్రిలిమినరీ) పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. పేపర్ లీకేజీ కుంభకోణానికి పాల్పడిన వారిపై సరైన చర్యలు తీసుకోకుండా, బాధ్యులైన వారిని శిక్షించకుండా ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్-1 (ప్రిలిమినరీ) పరీక్షను నిర్వహించారని రేవంత్ రెడ్డి అన్నారు. తప్పు ఎవరో చేస్తే ప్రభుత్వం విద్యార్థులను శిక్షిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అక్రమాలను బయటపెట్టి లక్షలాది మంది ఆశావహుల తరపున న్యాయం కోసం పోరాడిందని రేవంత్ అన్నారు. కానీ ప్రభుత్వం NSUI నాయకులను లక్ష్యంగా చేసుకుందని, వారిని పోలీసు బలగాలతో అణచివేసి కేసులు పెట్టిందని ప్రస్తావించారు.