W.G: తణుకు మండలం తేతలి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.