ATP: అనంతపురంలో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లాలోని 14 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఇవాళ ఉదయం పేపర్-1 పరీక్ష జరగ్గా 7,293 మందికి గానూ 6,463 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. పేపర్-1 పరీక్షకు 830 మంది గైర్హాజరైనట్లు వివరించారు. కలెక్టర్ డా. వినోద్ కుమార్ పలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.