W.G: పాలకోడేరు మండలం పెన్నాడ పంచాయతీలో ఎటువంటి అవినీతి జరగలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ చిల్లా అనూష అన్నారు. స్థానిక సచివాలయం వద్ద ఆదివారం గ్రామస్థులు, పాలకవర్గ సభ్యులు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ.. పంచాయతీలో కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయని కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.