NDL: ఏపీలో టమోటా, మిర్చి పంటలను సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాలని డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మద్దిలేటి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే వెంటనే మిర్చి పంటకు కనీస మద్దతు ధర 26 వేలుగా ప్రకటించాలని నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకోవాలన్నారు.