AKP: డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని విశాఖ జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి బీ.అప్పలనాయుడు అన్నారు. ఆదివారం నర్సీపట్నం ఆర్టీసీ డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్సిల్ రవాణాలో విజయనగరం జోన్ -1 ముందంజలో ఉందన్నారు. కావున సిబ్బంది ఎటువంటి ఫిర్యాదులకు తావివ్వకుండా పనిచేయాలన్నారు.