W.G: గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫౌండర్ చెన్న త్రికళ ఆధ్వర్యంలో నెల వారి బియ్యం పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్‌కు 150 కేజీలు, నిడదవోలు లెప్రసీ కాలనీ వారికి 300 కేజీలు అందచేశారు.