ప్రకాశం: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విధులలో ఎంత మాత్రం అలసత్వము, నిర్లక్ష్యము వహించరాదని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ పరీక్షల విధులలో పాల్గొనే అధికారులు, స్క్వాడ్ సభ్యులకు ఆదివారం మధ్యాహ్నం ఒంగోలులో శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా కేంద్రాలలో పరీక్షల నిర్వహణలో మీదే కీలక పాత్ర అన్నారు.