SKLM: జిల్లాలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్- 2 పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎచ్చెర్ల, శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రత, అభ్యర్థుల హాజరు, పరీక్ష సరళని క్షుణ్ణంగా పరిశీలించారు.