సత్యసాయి: ధర్మవరంలో తంబాపురం వాటర్ ప్లాంట్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించడంతో విద్యుత్ లైన్లు పూర్తిగా కాలిపోయాయని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. దీంతో ఈనెల 24, 25 తేదీల్లో నీటి సరఫరా నిలిచిపోనుందని చెప్పారు. విద్యుత్ లైన్ మరమ్మతులు జరుగుతున్నందున నీటి సరఫరా నిలిపివేయాల్సి వస్తోందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.