»Roja Challenge To Balakrishna After The High Court Verdict
Roja: హైకోర్టు తీర్పు తర్వాత బాలకృష్ణకు రోజా సవాల్!
అసెంబ్లీలో చంద్రబాబు కేసుపై చర్చించకుండా టీడీపీ నేతలు తప్పించుకున్నారని, బాబు పిటీషన్ను కోర్టు కూడా కొట్టి వేసిందని, దమ్ముంటే తనతో చర్చకు దిగాలని ఏపీ మంత్రి రోజా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సవాల్ విసిరారు.
నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి రోజా గట్టి సవాల్ విసరడం మరోసారి చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కాం జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేతలను సవాల్ చేశారు. బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిద్దామంటే టీడీపీ పారిపోయిందని విమర్శలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం వద్ద సరైన ఆధారాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసిందని రోజా ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీ ఏం చెబుతుందో అందరికీ తెలియాలన్నారు. చంద్రబాబు వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని, అసెంబ్లీలో చర్చించకుండా టీడీపీ నేతలు తప్పించుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిల్లర చేష్టలు చేశారని, ఆయనకు దమ్ముంటే, ధైర్యం ఉంటే హైకోర్టు వద్దకు వెళ్లి, జడ్జి ముందు అలాగే తొడగొట్టి, మీసం తిప్పి, విజిల్స్ వేయాలని రోజా అన్నారు.